NTV Telugu Site icon

Nagapur: మానవత్వం మరచిన దంపతులు.. చిన్నారి ఒంటిపై సిగరెట్, హాట్ పాన్ తో వాతలు

Girl

Girl

Nagapur Wife and Husband Harassed a Minor Girl: ఓ జంట మానవత్వం మరచిపోయింది. ఇంట్లో పనికి చిన్నారిని తెచ్చుకోవడమే నేరం, అలాంటిది వారు ఆమెను చిత్ర హింసలకు కూడా గురిచేశారు. నాగపూర్ లోని నాగ్‌పూర్‌లోని అథర్వ నగరి సొసైటీలో ఈ ఘటన జరిగింది. చిన్నారి ఏ తప్పు చేసిన ఆమెను దారుణంగా హింసించే వారు ఓ జంట. వేడిపాన్, కత్తులు, సిగరెట్లతో కాలుస్తూ హింసించే వారు. దంపతులు బయటకు వెళ్లిన సమయలో చిన్నారిని చుట్టు పక్కల వారు రక్షించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Also Read: Pawan Kalyan: ఇదేందయ్యా ఇది.. కుల గోత్రాలు ట్రెండింగ్ ఏంటయ్యా.. ?

వివరాల ప్రకారం నాగపూర్ కు చెందిన ఓ జంట బెంగుళూరు నుంచి ఓ 12 ఏళ్ల బాలికను ఇంట్లో పని చేయడం కోసం తెచ్చుకున్నారు. అసలే మైనర్ లను పనిలో పెట్టుకోవడమే నేరమైతే ఈ జంట ఆ చిన్నారిని చిత్రహింసలకు కూడా గురిచేసింది. చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్ష విధిస్తూ ఆ బాలికకు నరకం చూపించింది ఆ కసాయి జంట. ఇక ఆ జంట పని మీద బెంగుళూరు వెళుతూ చిన్నారిని ఇంట్లో పెట్టి వెళ్లింది. నాలుగు రోజులు వారు రాకపోవడంతో ఆ చిన్నారి సాయం కోసం అరిచింది. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆ బాలికను రక్షించారు. ఆమెను ఎన్జీవో సంస్థలకు అప్పగించారు. ఇక ఎన్జీవో ప్రతినిధి మాట్లాడుతూ ఆ దంపతులు చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించేవారని, ఏ చిన్న తప్పు చేసిన వేడి పాన్, వేడి కత్తి, సిగరెట్లతో కాలుస్తూ నరకం చూపించే వారని వెల్లడించారు.అంతే కాకుండా ఆమెకు సరిగా తిండి కూడా పెట్టే వారు కాదని తెలిపారు.  ఆమెను కాపాడిన అనంతరం బాలికను చిత్ర హింసలకు గురిచేసిన దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్జీవో సంస్థ ప్రతినిధులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి  ఆ దంపతులపై మైనర్ ను పనిలో పెట్టుకున్నందకు అలాగే చిత్ర హింసలు పెట్టినందకు కేసు నమోదు చేశారు.