Naga Chaitanya : వృషకర్మ, దూత – 2పై చైతు సెన్సేషన్ కామెంట్స్

Naga Chaitanya

Naga Chaitanya

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన రాబోయే చిత్రాల గురించి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ అందించారు. ప్రస్తుతం చైతు వృషకర్మ  సినిమాలో నటిస్తున్నాడు. svcc బ్యానర్ లో భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమా చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతోంది. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read : Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా

తాజాగా ఓ ఇంటర్వూలో తన సినిమాల అప్డేట్స్ గురించి చైతన్య మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాను. ఇప్పటికే 85 శాతం చిత్రీకరణ పూర్తయింది, కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రం చాలా వినూత్నంగా ఉండబోతోంది. అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తాను నటించిన  ఓటీటీ డెబ్యూ ధూత వెబ్ సిరీస్ కు సీక్వెల్‌ ధూత-2 కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని’ తెలిపాడు. విలక్షణమైన థ్రిల్లర్ కథాంశంతో సాగే ఈ సిరీస్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు వృషకర్మ నాగచైతన్య కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివర్లో వెండితెరపై చైతన్య సందడి చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి వరుస ప్రాజెక్ట్‌లతో చైతన్య ఫుల్ బిజీగా గడుపుతున్నారు.