NTV Telugu Site icon

Naga Shourya Marriage : పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్‌ హీరో.. ఎప్పుడంటే..!

Naga Shourya

Naga Shourya

నాగశౌర్య.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. అయితే.. నాగశౌర్య తెలుగు తెరకు పరిచయమై దశాబ్దకాలం గడుస్తోంది. 2011లో”క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్” అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య. కానీ.. ఆ తరువాత వచ్చిన ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య సినిమాను తనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్న నాగశౌర్య తాజాగా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ నెల 20న బెంగళూర్ లో నాగశౌర్య వివాహం జరుగనుంది. అనూషను నాగ శౌర్య మ్యారేజ్ చేసుకోనున్నారు. అయితే.. 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో.. ఇప్పటికే నాగ శౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది.

Also Read : Avatar The Way Of Water: ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కన్నడ ట్రైలర్ రిలీజ్
ఇదిలా ఉంటే.. నాగశౌర్య ఇటీవలే తన నెక్స్ట్‌ సినిమాను ‘NS24’ ప్రకటించారు. ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాస్‌ రావు, విజయ్‌ కుమార్, అరుణ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుడగా.. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ వెట్రీ పలనిస్వామి ఛాయగ్రాహకుడిగా పనిచేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాలకంటే భిన్నంగా కనిపిస్తాడని ఇటీవలే వెల్లడించింది చిత్రబృందం.

Show comments