NTV Telugu Site icon

Naga Shaurya: ఆ హీరోయిన్ ఎవరో చెప్తే.. నా పెళ్ళాం నన్ను మాములుగా కొట్టద్దు

Shurya

Shurya

Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. క్లాస్, మాస్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా శౌర్యకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే గత ఏడాదే శౌర్య ఒక ఇంటివాడు అయ్యాడు. కర్ణాటక బ్యూటీ అనూష శెట్టిని వివాహమాడాడు. ఇక పెళ్లి తరువాత నాగశౌర్య నటిస్తున్న చిత్రం రంగబలి. కొత్త డైరెక్టర్ పవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శౌర్య సరసన యుక్తి తరేజా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శౌర్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఛలో స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడట పవన్. ఇక రంగబలి జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచేసిన చిత్ర బృందం.. ఆ షో.. ఈ షో అని లేకుండా అన్ని షోలు కవర్ చేస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలను చెప్పుకొస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇక తాజాగా ఈ చిత్ర బృందం.. సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక షోలో సందడి చేసారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ షోలో శౌర్య.. తన భార్య గురించి చెప్పడం ఆకట్టుకొంటుంది. సుమ .. ఒక హీరోయిన్ ఫోటోను కొద్దిగా రివీల్ చేసి.. ఆ హీరోయిన్ ఎవరో నాగశౌర్యను గుర్తుపట్టమని చెప్తోంది. అందుకు శౌర్య.. ” ఇది చూసి కనిపెడితే నా పెళ్ళాం .. నన్ను మాములుగా కొట్టదు” అని చెప్పి షాక్ ఇచ్చాడు. దీంతో షోలో నవ్వులు పూశాయి. నిజం చెప్పాలంటే ఆ హీరోయిన్ ఫేస్ ను గుర్తుపట్టేవిధంగా కూడా ఆ ఫోటో లేదు.. కేవలం ఆమె బుగ్గలు, పెదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్స్ కూడా నిజమే.. బ్రో.. ఈ రేంజ్ లో ఉన్నా కూడా ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపడితే .. ఖచ్చితంగా పెళ్లాం చేతిలో దెబ్బలు తినాల్సిందే అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ కుర్ర హీరో.. ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా చూడాలంటే ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే.