యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు నాగ శౌర్య.
ఈ మధ్య కాలంలో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు నాగశౌర్య. సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను సాధిస్తున్నాడు.కెరీర్ మొదట్లో ఊహలు గుసగుసలాడే మరియు జ్యో అచ్యుతానంద వంటి క్లాస్ సినిమాలలో నటించిఅందరినీ మెప్పించాడు. ఆ తరువాత వచ్చిన ఛలో సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు . కానీ గత కొంత కాలంగా మాత్రం వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నాడు నాగ శౌర్య. తాజాగా ఈ హీరో నటించిన రంగబలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో నాగశౌర్య కు జంటగా యుక్తి తరేజా నటించింది రంగబలి సినిమాను పవన్ బసంశెట్టి తెరకెక్కించారు.. జులై 7 న విడుదల అయిన రంగబలి సినిమాను మంచి టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాగశౌర్య కొన్ని ఆసక్తికర విషయాలను తెలియచేశాడు. ఈ సందర్బంగా నాగశౌర్య మాట్లాడుతూ.. నేను కాలేజీ టైంలో మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ ని అంటూ చెప్పుకొచ్చారు.. బాస్కెట్ బాల్ గేమ్ బాగా ఆడేవాడిని. అలాగే బాస్కెట్ బాల్ గేమ్ నేషనల్స్ కూడా ఆడాను.పశ్చిమగోదావరి జిల్లా నుంచి నేషనల్ లెవల్ లో ఆడటానికి ఇద్దరు సెలెక్ట్ అయితే అందులో నేను కూడా వున్నాను.బాస్కెట్ బాల్ గేమ్ ను నేషనల్ లెవల్ లో చాలా సార్లు ఆడాను. ఇంటర్నేషనల్స్ కి కూడా వెళ్ళడానికి కోచింగ్ కూడా తీసుకున్నాను. కానీ ఎందుకో నా వల్ల కాదనిపించి వదిలేశాను అని చెప్పుకొచ్చాడు నాగశౌర్య. కాగా నాగశౌర్య చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.నాగశౌర్యలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.