Site icon NTV Telugu

Naga Chaithanya : యంగ్ డైరెక్టర్ తో నాగచైతన్య కొత్త మూవీ?

Naga Chaitanya

Naga Chaitanya

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే వీళ్ళు కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు వచ్చాయి.. నిఖిల్ తో చేసిన కార్తికేయ సిరీస్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న తండేల్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, ప్రేమమ్, లవ్ స్టోరీ వంటి సినిమాలను చెప్పొచ్చు. అక్కినేని హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చైతూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు.. ఈ సినిమా తర్వాత కొత్త సినిమాలను చైతూ లైన్లో పెడుతున్నాడు.. అందుకోసం గత కొన్నిరోజులుగా కథలను వింటున్నాడు… తన నెక్స్ట్ సినిమాను ఓ యంగ్ డైరెక్టర్ తో చేయబోతున్నాడు..

విరూపాక్ష సినిమాతో అద్భుతమైన ఘనవిజయాన్ని అందుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు.. ఆ సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ కు ఇండస్ట్రీలో డిమాండ్ కూడా బాగా పెరిగింది.. రీసెంట్ గా నాగచైతన్యతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ సినిమా కథను కూడా చైతూకు వినిపించారట.. కథ నచ్చడంతో చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. మరి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి..

Exit mobile version