Site icon NTV Telugu

Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!

Nagachaithanaya

Nagachaithanaya

నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ‘వృషకర్మ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత చైతూ ఏ సినిమా చేస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో, ఆయన నటించిన హిట్ వెబ్ సిరీస్ ‘దూత’కు సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలంగా అభిమానులు ‘దూత 2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సాగర్ పాత్రలో చైతన్యను మళ్ళీ ఆ సస్పెన్స్ మూడ్‌లో చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కాగా ‘దూత 2’ కోసం చైతన్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Also Read : Deepika Padukone: తల్లిగా బాధ్యతలు.. నటిగా కొత్త పాఠాలు.. దీపికా పదుకొణె ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ!

దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సీక్వెల్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ‘దూత’ మొదటి భాగం అమెజాన్ ప్రైమ్‌లో ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఆ సిరీస్‌లో చైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు అంతకు మించిన థ్రిల్‌ను అందించడానికి విక్రమ్ కె కుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబోతుండటం విశేషంత్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది పట్టాలెక్కితే, టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ సీక్వెల్స్‌లో ‘దూత 2’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

Exit mobile version