Site icon NTV Telugu

Naga Chaitanya-Sobhita: చై, శోభితలకు మంగళస్నానాలు.. వీడియో వైరల్!

Naga Chaitanya Sobhita

Naga Chaitanya Sobhita

హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ క్రమంలోనే చై, శోభితల పెళ్లి పనులు ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా హల్దీ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి హల్దీ వేడుకను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. చై, శోభితలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో చై మూడుముళ్లు వేయనున్నారు. ఏఎన్నార్ ఆశీస్సులు ఉండాలనే భావనతోనే ఇరు కుటుంబాల పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. టాలీవుడ్ నుంచి దగ్గుబాటి, మెగా, నందమూరి ఫ్యామిలీలలోని అందరూ విచ్చేయనున్నారు.

Exit mobile version