ఇటీవలి రోజుల్లో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు వరుసగా పెరుగుతూ.. మరలా తగ్గుతోంది. అయితే భారీగా పెరిగే గోల్డ్ రేట్స్.. స్వల్పంగానే తగ్గుతున్నాయి. దాంతో మరోసారి పసిడి ధరలు 80 వేల మార్కుకు దగ్గరలో ఉన్నాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గగా.. నేడు రూ.670 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.160 తగ్గగా.. నేడు రూ.760 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,110గా ఉంది.
మరోవైపు ఇటీవలి రోజుల్లో స్థిరంగా లేదా తగ్గుతూ వచ్చిన వెండి ధర.. నేడు షాక్ ఇచ్చింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రెండు వేలు పెరిగి.. రూ.91,500గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష అయింది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.91,500గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,600
విజయవాడ – రూ.71,600
ఢిల్లీ – రూ.71,760
చెన్నై – రూ.71,600
బెంగళూరు – రూ.71,600
ముంబై – రూ.71,600
కోల్‌కతా – రూ.71,600
కేరళ – రూ.71,600
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,110
విజయవాడ – రూ.78,110
ఢిల్లీ – రూ.78,260
చెన్నై – రూ.78,110
బెంగళూరు – రూ.78,110
ముంబై – రూ.78,110
కోల్‌కతా – రూ.78,110
కేరళ – రూ.78,110
Also Read: Vidaamuyarchi Teaser: డైలాగ్స్ లేవమ్మా, ఫుల్ యాక్షన్.. ఆసక్తిగా’తలా’ విదాముయార్చి టీజర్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.91,500
ముంబై – రూ.91,500
చెన్నై – రూ.1,00,000
కోల్‌కతా – రూ.91,500
బెంగళూరు – రూ.91,500
కేరళ – రూ.1,00,000