Site icon NTV Telugu

Nag Aswin: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి విమర్శలకు నాగ్ అశ్విన్ రిప్లై అదుర్స్ కదూ..

Kalki

Kalki

Nag Aswin: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా అశ్విన్ తన X ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ., ఆయన పిల్లలకి బుజ్జి టాయ్స్ పంపిస్తున్నా.. ప్రతి ఒక్కరినీ గెలిచేందుకు కల్కి పార్ట్ – 2 కోసం కష్టపడి పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.

Gangrape Case: తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు చెరువులో దూకి మృతి.. (వీడియో)

ఈ విషయంపై ఇదివరకే తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మా మూవీ అసోసియేషన్ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడింది. ఇందుకు సంబంధించి కూడా బహిరంగంగా విడుదల చేసింది. మా మూవీ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో భాగంగా.. మనమంతా యాక్టర్స్ ఫ్యామిలీకి చెందినవాళ్లమని.. ఒకరి గురించి ఇలా మాట్లాడటం సరికాదంటూ తెలిపాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలాంటి చీప్ కామెంట్ చేయడం తెలుగువారి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన తెలిపారు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని విష్ణు కోరాడు.

Exit mobile version