Site icon NTV Telugu

Chiranjeevi : మెగాస్టార్ తో జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్

Nagi Chiru

Nagi Chiru

టాలీవుడ్‌లో ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ‘కల్కి 2898 AD’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. నాగ్ అశ్విన్ పురాణాలను, ఫాంటసీని కలిపి వెండితెరపై ఆవిష్కరించడంలో కల్కితో తన మార్క్ చూపించాడు.

Also Read : Varanasi : వారణాసిలో రాజమౌళి ఆస్థాన అగ్రహీరో కీలక రోల్

ఇప్పుడు చిరంజీవి కోసం కూడా ఒక భారీ మైథలాజికల్ నేపథ్యం ఉన్న కథను రాసుకున్నారని సమాచారం. జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ అనికూడా టాక్ నడుస్తోంది. త్వరలోనే ఆయన మెగాస్టార్‌ను కలిసి ఈ పూర్తి కథను వినిపించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తెలుగు సినీ చరిత్రలో ఇది మరో ల్యాండ్‌మార్క్ సినిమాగా నిలిచిపోవడం ఖాయం.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్‌తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘కల్కి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అశ్వినీదత్ గారు, ఈ మెగా ప్రాజెక్ట్‌ను కూడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట. చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, నాగ్ అశ్విన్ లాంటి విజనరీ డైరెక్టర్ చెప్పే కథ వైవిధ్యంగా ఉంటే ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. మెగాస్టార్ నటన, నాగ్ అశ్విన్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు నాగి తన నెక్ట్స్ సినిమా కల్కి సీక్వెల్ పనుల్లోనూ బిజీగా ఉన్నారు.

Exit mobile version