NTV Telugu Site icon

Nadigam Suresh : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్‌

Nadigam Suresh

Nadigam Suresh

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి తరలిస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలన్న తన ఆదేశాలను కొనసాగించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. అయితే.. హైదరాబాద్‌ మియాపూర్‌లో నందిగం సురేష్‌ అరెస్ట్‌ చేశాయి ఏపీ ప్రత్యేక బృందాలు. విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజా రెడ్డి భర్త శ్రీనివాస్‌ రెడ్డిని సైతం అరెస్ట్‌ చేసిన పోలీసులు మంగళగిరికి తరలిస్తున్నారు.

America Elections : అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రవేశం! ఓటర్లపై కుట్ర జరుగుతోందని ఆరోపణ

మాజీ మంత్రి జోగి రమేష్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్.చంద్రబాబు నాయుడు నివాసం వద్ద జరిగిన గొడవ కేసులో తనకు, ఆయన అనుచరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తమను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే 2021లో జరిగిన ఈ ఘటనలో తమను నిందితులుగా చేర్చుతున్నారనే పిటిషనర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, నందిగాం సురేష్, దేవినేని అవినాష్, పలువురు కార్యకర్తలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్లను ఆగస్టు 21న విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దేవినేని అవినాశ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం త‌దితరులు నిందితులుగా ఉన్నారు.

Uttar Pradesh: అంబులెన్స్‌లో దారుణం.. పేషెంట్‌ భార్యనే లైంగికంగా వేధించిన డ్రైవర్..!

Show comments