Site icon NTV Telugu

Nadendla Manohar: తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ ప్రయాణమా?

Manohar

Manohar

సీఎం జగన్ సవాల్ పై నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేసే దమ్ము, పోరాడే దమ్ము జనసేనకు ఉంది. ఎన్నికల వేళ అది చూసుకుందాం. ముందు ప్రజాధనంతో నిర్వహించే ప్రభుత్వ సభల్లో ఎలా మాట్లాడాలో, రాజకీయ ఉపన్యాసాలెందుకు ఇవ్వకూడదో ఈ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి.ఇంట్లోవాళ్లే నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడు..?రైతులపై అక్రమంగా కేసులు పెట్టించిన ప్రభుత్వం ఇదీ.మాండౌస్ తుపాను పరిహారం ఇప్పటికీ అందలేదు.కళ్లెదుటే రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే చలనం లేని ప్రభుత్వం.

దేశంలోనే ధనిక సీఎం జగన్ రెడ్డి తన సంపద నుంచి పైసా కూడా పేదలకు ఇవ్వలేదు.ప్రధాని జమ చేసిన నిధులకు మీ హడావుడి ఎందుకు..?సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న బిడ్డగా ముద్రపడిన జగన్ రెడ్డిని ఏ కుటుంబమూ బిడ్డగా ఒప్పుకోదు.ధాన్యం కొనమని అడిగితే అరెస్టులు.. పండించిన ధాన్యం కొనండని రైతులు ప్రశ్నిస్తే, వారిని అక్కడికక్కడే వీధి రౌడీల మాదిరి అరెస్టు చేయిస్తున్నారు.నిన్ననే కర్ణాటక టూర్ లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తే, మళ్లీ అవే డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కడం ఏమిటి..? అన్నారు నాదెండ్ల.

Boppararaju Venkateswarlu: సీఎస్ తో బొప్సరాజు భేటీ.. ఉద్యమ కార్యాచరణ వెల్లడి

నాలుగేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.54 వేల సాయం అందించామని చెబుతున్న ఈ సీఎం జగన్ తప్పుడు లెక్కలతో మభ్య పెడుతున్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ఈ ప్రభుత్వం ద్వారా అందింది కేవలం రూ.26 వేలు మాత్రమే.దీనికోసం ఇంతటి ఖర్చులెందుకు..?తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ ప్రయాణమా?ధనిక ముఖ్యమంత్రి క్లాస్ వార్ అంటుంటే ప్రజలు నవ్వుతున్నారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు ఉన్న జగన్ రెడ్డి ఇప్పుడు క్లాస్ వార్ అంటూ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. జగన్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన సంపాదించిన దానిలో 10 శాతం రాష్ట్ర ప్రజలకు పంచి అప్పుడు వార్ లు గురించి మాట్లాడాలి. ఏనాడూ పైసా కూడా పేదలకు ఇవ్వలేదు.చాలా ఆవేశంతో జగన్ రెడ్డి చెప్పే మాట సామాన్యుడికి సైతం నవ్వు తెప్పిస్తోంది.కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు..?సీఎం సభలో చప్పట్లు ఎప్పుడు కొట్టాలి..? ఈలలు ఎప్పుడు వేయాలో కూడా శిక్షణ ఇచ్చి సభకు తీసుకెళ్లారు.టార్గెట్లు పెట్టి, బెదిరించి జనాన్ని తీసుకొచ్చారు. తెనాలిలో కరెంటు కట్ చేసి, ఆస్పత్రిలో జనం చనిపోయేలా చేశారు. ఇవన్నీ చేసి సభలు పెట్టుకొని, మీ జబ్బలు మీరే చరుచుకోవడమే మీ నైజం అని ఎద్దేవా చేశారు.

Read Also: Naga Shourya: వారితో రోడ్డుపై నాగ శౌర్య రచ్చ.. సారీ చెప్పు ముందు అంటూ

Exit mobile version