Site icon NTV Telugu

Nadendla Manohar : పేదలపై ప్రేమ ఉంటే ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వాలి..

Nadendla Manohar

Nadendla Manohar

ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అంటూ ఆయన అన్నారు. పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి ఆరోగ్యశ్రీకి వెంటనే నిధులు ఇవ్వాలన్నారు. వైసీపీ పాలకులు ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం చేసే నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు బకాయిపడింది.. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల నిర్వాహకులు అనేక మార్లు ప్రభుత్వాన్ని కోరినా సరిగ్గా స్పందించ లేదు అంటూ నాదేండ్ల అన్నారు.

Also Read : Tom Cruise: టామ్ క్రూయిజ్ తడాఖా చూపిస్తాడా!?

అరకొరగా నిధులు ఇచ్చి పేదలకు వైద్యం చేయిస్తున్నామని మభ్యపెట్టే ప్రయత్నాలే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నాయి అంటూ నాదేండ్ల మనోహర్ అన్నారు. బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవలు కొనసాగించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు గత నెలలోనే తేల్చి చెప్పినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు అని ఆయన అన్నారు. ఇదేనా పేదల పక్షం ఉన్నామని గొప్పలు చెప్పుకొనే పాలన. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అని తెలుసుకోవాలి.. ఈ సీఎంకు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి నిధులు ఇచ్చి, ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోకుండా చూసేవారు అని నాదేండ్ల మరోహర్ అన్నారు.

Also Read : Fire Accident : సోఫా గోదాంలో అగ్ని ప్రమాదం.. 15 లక్షల ఆస్తినష్టం

ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆరోగ్యశ్రీకి నిధులు రిలీజ్ చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నం కాబోతుందని జనసేన పార్టీ పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయింపు సక్రమంగా లేదు, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించడం లేదు, ఫలితంగా పేదలు ఇబ్బందిపడతారని పదేపదే చెప్పాం.. అయినా పాలకుల చెవికెక్కలేదు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ప్రతిపక్షాలను విమర్శిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతూ అదే పాలన అనుకొనే ముఖ్యమంత్రి ముందుగా ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Exit mobile version