Janasena – TDP Coordination Meetings: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడవాలని నిర్ణయించిన విషయం విదితమే.. ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు.. ఈ నెల 30వ తేదీన కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి మీటింగులు ఉండనున్నారు.. ఇక, ఈ నెల 31వ తేదీన విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం కానున్నారు టీడీపీ – జనసేన పార్టీల నేతలు. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరుకానున్నారు..
Read Also: Salmonella Outbreak: అమెరికాలో సాల్మొనెల్లా వ్యాప్తి.. ఉల్లిపాయలే కారణం..
ఇక, జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, ముఖ్య నేతలతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగే జనసేన – టీడీపీ సమన్వయ సమావేశాలపై చర్చించారు.. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగే ఈ సమన్వయ సమావేశాలను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలవి సూచించారు. ఈ సమావేశాల నిర్వహణను ఆయా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు చూసుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టని ఐదు జిల్లాలకి కో – ఆర్డినేటర్లుగా పార్టీ సీనియర్ నేతలను నియమించింది జనసేన పార్టీ.. ఆ ఐదు జిల్లాల్లో సమన్వయ సమావేశాలను పర్యవేక్షించనున్నారు కో-ఆర్డినేటర్లు.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా – పాలవలస యశస్వి.. ఉమ్మడి విజయనగరం జిల్లా – లోకం నాగమాధవి.. ఉమ్మడి కడప జిల్లా – సుంకర శ్రీనివాస్.. ఉమ్మడి కర్నూలు జిల్లా – చింతా సురేష్.. విశాఖ అర్బన్ జిల్లా – కోన తాతారావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది జనసేన.
29, 30, 31 తేదీల్లో జనసేన – టీడీపీ జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు pic.twitter.com/oCsJRCum0t
— JanaSena Party (@JanaSenaParty) October 26, 2023