NTV Telugu Site icon

Nadendla Manohar: జగన్ కు సాయం చేసేందుకే బీఆర్ఎస్

Nadendla Manohar

Nadendla Manohar

ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన నేతలు కొందరు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీలో బీఆర్ఎస్ ప్రారంభించడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్లో నిజాయితీ ఉండాలన్నారు. జగన్ కు సాయం అందించడానికి జనసేన ఓటు చీల్చడానికీ బీఆర్ యస్ పెట్టారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీ చీలిక తెచ్చిందని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్.

Read Also: Vasireddy Padma: మహిళా పోలీసులపై చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలపై ఫిర్యాదు

ఇప్పుడు బీఆర్ యస్ పార్టీ ఏర్పాటుతో ఏపీకి న్యాయం ఎలా చేస్తారు….? బాధ్యత గల ప్రతిపక్షంగా జనసేన చేస్తున్న కార్యక్రమాల్ని కూడా ప్రభుత్వం దుర్మార్గంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీజీపీ కి ఇప్పటికే యువ శక్తి కార్యక్రమం గురించి తెలియజేసాం. 175కు 175 గెలుస్తామన్న సీఎం జగన్ ప్రతిపక్షాల సభలు చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిని బట్టి చూస్తే సీఎం జగన్ అభద్రతలో ఉన్నట్టేనన్నారు. జనవరి 12 న రణస్థలంలో యువశక్తి కార్యక్రమం జరుపుతున్నాం. ఉత్తరాంధ్ర యువత,మత్స్యకారుల సమస్యలపై చర్చ జరుగుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Read Also: Hookah Parlour : హుక్కా పార్లర్‌లకు హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌