Lyricist Chandrabose : కలల వెతుకులాట నుంచి ఆస్కార్ విజయం వరకు తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. 1995లో ‘తాజ్ మహల్’ చిత్రంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొని నేడు ప్రపంచ వేదికపై తెలుగు పాట జెండాను ఎగురవేశారు. ఆయన ఇటీవల ‘NTV’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.
READ ALSO: Rishabh Pant: నేడే న్యూజిలాండ్‌తో వన్డేలకు టీమిండియా జట్టు ఎంపిక .. పంత్‌కు ఛాన్స్ ఉందా?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుంటుందని తాను ముందుగా ఊహించలేదని చంద్రబోస్ తెలిపారు. ఆస్కార్ అవార్డు చేతికి వచ్చినప్పుడు దాని బరువు 4 కిలోలు అనిపించినా, మానసికంగా అది 140 కోట్ల భారతీయుల కలల బరువుగా, పరువుగా అనిపించిందని చెప్పారు. సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి ఆస్కార్ కావడంతో ఆ గౌరవం వెలకట్టలేనిదని అన్నారు. తన చిన్నతనం నుంచి కూడా పుస్తక పఠనం పట్ల మక్కువ ఎక్కువ అని అన్నారు. ‘బొమ్మరిల్లు’, ‘చందమామ’, ‘బుజ్జాయి’, ‘బాలమిత్ర’ వంటి పుస్తకాలు ఆయన ఊహాశక్తిని పెంచాయి, తన చిన్నప్పుడు చదివిన కథలే తనను రచయితగా మార్చడానికి పునాది వేశాయని గుర్తుచేసుకున్నారు. దేని కోసం అయితే చిన్నతనంలో అన్వేషించారో, ఆ నిజంలోనే ఇప్పుడు జీవిస్తున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
READ ALSO: Akhil Akkineni Lenin: అఖిల్ ఫ్యాన్స్‌కి ట్రీట్.. ‘లెనిన్’ ఫస్ట్ సింగిల్‌కి డేట్ లాక్
