Naa Saami Ranga Day 2collections : రెండో రోజు పెరిగిన నాగార్జున మూవీ కలెక్షన్స్ ..ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజాగా సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న విడుదలైంది.. ఈ సినిమాకు ఊహకు అందని విధంగా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడు కూడా అదే జోష్ తో దూసుకుపోతుంది.. ఇక మొదటి రోజు బాగానే కలెక్షన్స్ ను రాబట్టింది.. ఇక రెండో రోజు ఏ మాత్రం కలెక్షన్స్ ను రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే ‘నా సామిరంగ’. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు..’నా సామిరంగ’ మూవీకి నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.22 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.01 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2.01 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.23 కోట్లు బిజినెస్ అయిన విషయం తెలిసిందే..
Also Read
ఈ సినిమాకు రెండో రోజు బాగానే కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో నా సామిరంగ చిత్రానికి నైజం రూ.1.47కోట్లు, సీడెట్ రూ. 76లక్షలు, వైజాగ్ రూ. 56 లక్షలు, ఈస్ట్ రూ. 54 లక్షలు, వెస్ట్ రూ.34 లక్షలు, కృష్ణ రూ. 26లక్షలు, గుంటూరు రూ.41లక్షలు, నెల్లూరు రూ.20లక్షలు వసూలు చేసింది. ఇక రెండో రోజు నా సామి రంగ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్లు రాబట్టింది.. మొత్తంగా కలిపి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 17.8 కోట్లు రాబట్టింది.. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!