Site icon NTV Telugu

Mystery Box At Vizag: విశాఖ తీరంలో మిస్టరీ బాక్స్‌పై ఉత్కంఠకు తెర.. అసలు అది పెట్టే కాదు..!

Mystery

Mystery

Mystery Box At Vizag: విశాఖపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చెక్క పెట్టెపై పెద్ద రచ్చే జరిగింది.. ఆ మిస్టరీ బాక్స్‌లో ఏముంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? సంఘ విద్రోహుల చర్య..? ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయా? అనే ఆసక్తితో పెద్ద సంఖ్యలో స్థానికులకు, పర్యాటకులు తరలివచ్చారు.. వైజాగ్‌ వైఎంసీఏ బీచ్‌ తీరానికి అర్థరాత్రి కొట్టుకొని వచ్చిన చెక్క పెట్టెను ఎప్పుడు తెరుస్తారంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.. చివరకు సముద్ర అలలతో కొట్టుకొని వచ్చిన చెక్క పెట్టెలో ఏమీ లేదని తేలిపోయింది. అది వట్టి చెక్కపెట్టె మాత్రమే.. అంటే అది పెట్టె కూడా కాదనే చెప్పాలి.. ఎందుకంటే వరుగా చెక్కలు మాత్రమే ఉన్నాయి.. వాటి మధ్యలో ఎలాంటి గ్యాప్‌ కూడా లేదన్నమాట..

Read Also: Kumari Srimathi : ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న కుమారి శ్రీమతి వెబ్ సిరీస్.

అయితే.. ఆ చెక్కపెట్టెపై సమాచారం అందుకున్న పోలీసులు.. దానిని తెరిచేందుకు 2 ప్రొక్లెయిన్‌ని ఉపయోగించారు. లోపల కూడా చెక్కలే తప్ప ఇంకేమీ లేదని గుర్తించారు. ఆ చెక్కలను వేరే చేసే సమయంలో.. ఎలాంటి పేలుడు పదార్థాలైనా ఉన్నాయేమోనన్న అనుమానంతో జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.. 5 వరుసల చెక్కలతో ఉన్న ఈ పెట్టెను తెరిచేందుకు 2 ప్రొక్లెయిన్‌ని ఉపయోగించారు. చివరకు లోపల కూడా చెక్కలే తప్ప ఇంకేమీ లేదని తెలిసి షాక్‌ తిన్నారు.. అయితే, ఆ చెక్కలను వేరే చేసేందుకు ముందు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి.. ఈ తనిఖీల్లో ఆ బృందాలకు ఏమీ లభించలేదు. దాంతో ఈ పెట్టెను పగలగొట్టించేందుకు రెండు ప్రొక్లెయినర్లను రంగంలోకి దించారు. అయితే, ఓడలు తీరంలో ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా ఉండేందుకు అడ్డుగా దీనని వాడుతుంటారని అధికారులు చెబుతున్నారు.. మొత్తంగా ఆ పెట్టె ఏకంగా 100 టన్నుల బరువు ఉండటంతో.. అందులో ఏముంది అనేదానిపై ఆసక్తి నెలకొనగా.. అది చివరకు వట్టి చెక్కలు మాత్రమేనని తేలిపోయింది.

Exit mobile version