Mynampally Hanumantha Rao: మెదక్‌లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డిలపై మైనంపల్లి హనుమంతరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఖబడ్ధార్ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. వేలాది మంది జనాలను, పోలీసులను అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారని ఆయన అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని…హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మైనంపల్లి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకే అన్ని పథకాలు వస్తున్నాయన్నారు. హరీశ్ రావు మెదక్ జిల్లాకు పట్టిన శని అని, ఇంకో నెలలో ఆ శని పోతుందన్నారు. సిగ్గు శరం లేకుండా కోట్లు పెట్టి నాయకులని కొంటున్నారని ఆయన ఆరోపించారు. మల్కాజ్‌గిరిలో నాపై పోటీకి ఓ టోపీ మాస్టర్‌ను తీసుకువచ్చారని చెప్పారు మైనంపల్లి హనుమంతరావు.
Also Read: Nagam Janardhan Reddy: నాగర్ కర్నూల్ భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నా..
మల్లారెడ్డి పిల్లికి బిచ్చం వెయ్యడని, ఆయనకు చదువు కూడా రాదని మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 200 కోట్లిచ్చి మల్లారెడ్డి అల్లుడు ఎంపీ టికెట్ కొన్నాడని ఆయన ఆరోపించారు. మల్లారెడ్డికి సంతకం కూడా పెట్టరాదని ఎద్దేవా చేశారు. మేడ్చల్‌లో ఎక్కడ చూసినా మల్లారెడ్డి కుంభకోణాలే అంటూ ఆయన ఆరోపించారు. చెరువు పక్కకి రెండెకరాల భూమి తీసుకుని పదెకరాల భూమి కబ్జా చేస్తాడంటూ విమర్శలు గుప్పించారు.