Site icon NTV Telugu

Mynampally Hanumanth Rao : ఇన్ని రోజులు మీరు సంపాదించింది మొత్తం ఖర్చు పెట్టిస్తా

Mynampally

Mynampally

చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఇక్కడ ర్యాలీ చేయొద్దు అని అంటున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మీరు మాత్రం కార్లతో ర్యాలీగా పక్క రాష్ట్రాలకి వెళ్లొచ్చా అని ఆయన ప్రశ్నించారు. మీ పార్టీకో న్యాయం.. మాకో న్యాయమా.. అని ఆయన అన్నారు. మీ పార్టీలో ఉంటే కేసులు ఉండవు…పార్టీ మారితే తెల్లారే కేసులు పెడుతారని, ఇన్ని రోజులు మీరు సంపాదించింది మొత్తం ఖర్చు పెట్టిస్తానన్నారు మైనంపల్లి. మైనంపల్లి అనేటోడు భయపడి పారిపోయేటోడు కాదని, కొందరు నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

Also Read : Bombay High Court: మహారాష్ట్ర మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్.. రేపు అత్యవసర విచారణ

డబ్బుల సంచులతో హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెబుతున్నారని, మాతో ఎవ్వరు తిరిగిన దళిత బంధు, రైతు బంధు ఇవ్వమని భయపెడుతున్నారన్నారు. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు అమెరికాలాగా ఉన్నాయి..మిగతా నియోజకవర్గాలు ఎందుకు లేవని, మెదక్, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదన్నారు. పార్టీ మారగనే నాపై కక్ష కట్టారు…ప్రతి పనిలో 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని, ఆర్టీసీని విలీనం చేసింది ఆర్టీసీ విలువైన భూములు అమ్ముకోవడానికే అని ఆయన అన్నారు.

Also Read : Mama Mascheendra: ఇండియన్ సినీ హిస్టరీలోనే ‘‘మామా మశ్చీంద్ర’’ ప్రయోగం

Exit mobile version