Site icon NTV Telugu

Shakeela: నా ఫస్ట్ సె** అతనితోనే.. సీక్రెట్ బయట పెట్టిన షకీలా

Whatsapp Image 2023 08 18 At 10.51.08 Am

Whatsapp Image 2023 08 18 At 10.51.08 Am

Shakeela: ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆమె సినిమా రిలీజ్ అవుతుంది అంటే భయపడిపోయేలా పాపులారిటీ సంపాదించిన తార షకీలా. తను బీ గ్రేడ్ సినిమాలు నటించి అప్పట్లో మగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎంతోమంది హీరోయిన్ తన సినిమా వస్తుందని వారి చిత్రాలను పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. అంతలా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది షకీలా. నెక్కరేసుకున్న కుర్రాళ్ల దగ్గర్నుంచి.. పండు ముసలోళ్ల దాకా షకీలా అంటే పడి చచ్చిపోయేవారు. అంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి షకీలా.

Read Also:Jasprit Bumrah: నేను పాత బుమ్రానే.. కెరీర్‌ ముగిసిందనే ఆలోచనే రానివ్వలేదు!

ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ తన అభిమానులకు అలరిస్తూనే ఉన్నారు. కొన్ని సపోర్టింగ్ రూల్స్ పోషిస్తూ వెండి తెరపై కనిపిస్తున్నారు షకీలా. తను తెరకు పరిచయం అయ్యే ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొంది షకీలా. ఈ మధ్యకాలంలో షకీలా పలు వివాదాస్పదమైన ప్రకటనలతో సోషల్ మీడియాలో ముఖ్యాంశాల్లో నిలుస్తున్నారు. తాను తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం బయటపెట్టింది.

Read Also:Alert: ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త మొబైల్ పేలిపోవచ్చు

వాస్తవానికి కేరళ ప్రాంతానికి చెందిన షకీలా 1980 దశాబ్దంలో అడల్ట్ సినిమాల స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అడల్ట్ సినిమాలో నటించడం మానేసి ఇతర భాషలలో కూడా కీలక పాత్రలలో నటించడం స్టార్ట్ చేసింది. తాజాగా ప్రముఖ నటుడు, కమెడియన్ అయిన వడివేలు పై పలు వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసింది. తను మొదటి శారీరక సంబంధం గురించి నటి షకీలా సూటిగా మాట్లాడింది. తన కన్యత్వం కోల్పోవడం గురించి తెలియజేసింది. “నేను వర్జిన్ కాదు.. నా స్నేహితుడితో మొదటిసారి తన శరీరాన్ని పంచుకున్నాను” అని అతని పేరు రీఛర్డ్ పాల్ అని వెల్లడించింది. ప్రస్తుతం షకీలా తెలియజేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version