NTV Telugu Site icon

Bird Flu Outbreak: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. వెయ్యికి చేరిన కిలో మటన్ ధర!

Mutton

Mutton

రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మార్కెట్‌పై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. ఆదివారం అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ప్లూ భయంతో చికెన్ కొనేవారు లేకుండా పోయారు. అయినా చికెన్ ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర కేజీ రూ.180 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా పరిశీలిస్తే.. రూ.220 నుండి ప్రస్తుతం రూ.180-150కు ధర పడిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్‌కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది.

బర్డ్ ప్లూ భయంతో మాంసం ప్రియులు చికెన్ తినడం మానేశారని, దీనితో తీవ్రంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. డాక్టర్లు, శాస్త్రవేత్తలు చికెన్ తినవచ్చు అని చెబుతున్నా.. ప్రజలు మాత్రం భయం వీడటం లేదని ఆవేదన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడటంతో మాంసాహార ప్రియులు అందరూ చేపలు, రొయ్యలు, మటన్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో చేపల, మటన్ మార్కెట్లో భారీ సంఖ్యలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. రూ.800 ఉన్న కిలో మటన్ ఏకంగా వెయ్యి రూపాయలు ధర పలుకుతుంది. చికెన్ తినడం మానేసిన ప్రజలు మటన్ షాపుల వద్ద క్యూ కట్టారు. ఈరోజు ఆదివారం కావడంతో మటన్ షాప్ల వద్ద జనాలు క్యూ కట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మటన్ మార్కెట్ వద్ద భారీగా జనాలు గుమికూడారు.