Bird Flu Outbreak: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. వెయ్యికి చేరిన కిలో మటన్ ధర!
- చికెన్ మార్కెట్‌పై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్
- వెలవెలబోతున్న చికెన్ షాపులు
- మటన్ షాప్ల వద్ద జనాల క్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మార్కెట్‌పై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. ఆదివారం అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ప్లూ భయంతో చికెన్ కొనేవారు లేకుండా పోయారు. అయినా చికెన్ ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర కేజీ రూ.180 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా పరిశీలిస్తే.. రూ.220 నుండి ప్రస్తుతం రూ.180-150కు ధర పడిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్‌కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది.
బర్డ్ ప్లూ భయంతో మాంసం ప్రియులు చికెన్ తినడం మానేశారని, దీనితో తీవ్రంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. డాక్టర్లు, శాస్త్రవేత్తలు చికెన్ తినవచ్చు అని చెబుతున్నా.. ప్రజలు మాత్రం భయం వీడటం లేదని ఆవేదన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడటంతో మాంసాహార ప్రియులు అందరూ చేపలు, రొయ్యలు, మటన్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో చేపల, మటన్ మార్కెట్లో భారీ సంఖ్యలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. రూ.800 ఉన్న కిలో మటన్ ఏకంగా వెయ్యి రూపాయలు ధర పలుకుతుంది. చికెన్ తినడం మానేసిన ప్రజలు మటన్ షాపుల వద్ద క్యూ కట్టారు. ఈరోజు ఆదివారం కావడంతో మటన్ షాప్ల వద్ద జనాలు క్యూ కట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మటన్ మార్కెట్ వద్ద భారీగా జనాలు గుమికూడారు.
Also Read
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!