NTV Telugu Site icon

Muthireddy Yadagiri Reddy: దేవుడా మూడోసారి కూడా కేసీఆరే సీఎం కావాలి..

Muthi Reddy

Muthi Reddy

సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ మూడో సారి సీఎం కావాలని కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మధ్య నియోజకవర్గంలో ఉద్యమం, పోరాటాలు తెలియని కార్పోరేట్ శక్తులు అధికార, డబ్బు బలంతో నీచపు రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉన్నప్పటికీ నా కుటుంబ సమస్యలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

Read Also: Shraddha Das : చీర కట్టులో మెరిసిన శ్రద్ధా.. బిగవైన అందాలతో రెచ్చగొడుతుందిగా..

నేను సీఎం కేసిఆర్ తోనే ఉంటా.. ప్రగతి భవన్లోనే ఉంటానని చెబుతూ నియోజకవర్గ కార్యకర్తలను మభ్య పెట్టే ప్రయత్నం పల్లా రాజేశ్వర్ రెడ్డి చేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించాడు. తానే గొప్ప మేధావి, తన మేధస్సుతోనే వీఆర్ఏలకు విధులు, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసినరు అని చెప్పుకుని తిరిగే నీవ్వు ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావు అని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ప్రశ్నించారు. పందికొక్కు మాదిరి దోచిన డబ్బుతో రాజకీయాలు చేయాలని చేస్తున్నావ్.. నువ్వు నడుపుతున్న కాలేజీ ఎవరిది, ఆడబిడ్డ పేరున ఉన్న కాలేజీని కబ్జా పెడితే.. నీ అక్క డిప్రెషన్ లోకి పోయింది నిజం కాదా అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.

Read Also: CM YS Jagan: నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్..? పాతవారే కొనసాగింపు..!

ఆడబిడ్డ ఆస్తిని ఆక్రమించిన నీకు తగిన శాస్తి జరుగుతది.. నేనే ముఖ్యమంత్రికి అడ్వైజ్ చేస్తున్న అని చెప్పడం సిగ్గు చేటు.. మంత్రి హరీష్ రావు సైతం సీఎం కేసిఆర్ సారథ్యంలో పనిచేస్తున్న అని చెబుతారు.. అలాంటి నువ్వు సీఎం కేసిఆర్ కు అన్నిటిలో అడ్వైజ్ చేస్తానంటూ అహంకారపు మాటలు మాట్లాడ్తవా అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఈ అహంకారపు మాటలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయనే భావనతో మాట్లాడాల్సి వస్తుంది.. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉన్నప్పటికీ స్టేషన్ ఘనపూర్ లో పార్టీ కార్యకర్తలతో ఎలా మీటింగ్ పెడతావు.. రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే అసలు మండలాలు, గ్రామాలు, ఎక్కడ ఉంటాయి తెల్వదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.