NTV Telugu Site icon

AP Crime: దారుణం.. మూగ యువతిని బెదిరించి 3 నెలలుగా సామూహిక అత్యాచారం..

Crime

Crime

AP Crime: ఎవడిని నమ్మాలో.. ఎవడు నమ్మించి కాటేస్తాడు తెలియని పరిస్థితులు దాపురించాయి.. చివరకు దివ్యాంగురాలు అనే కనికరం చూడకుండా.. అదే అదునుగా భావించి నెలల తరలబడి అత్యాచారం చేయడమే కాక.. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి ఓ మూగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు ఓ కామాంధుడు.. చివరకు యువతి గర్భం దాల్చడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన ప్రకాశం జిల్లాలలో కలకలం సృష్టిస్తోంది..

Read Also: Harish Shankar : తీవ్ర మెడ నొప్పితో రవితేజ షూటింగ్.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్..

చీమకుర్తి మండలం చండ్రపాడులో ఓ దివ్యాంగురాలిపై మూడు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు ముగ్గురు యువకులు.. మాటలు రాని, వినపడని యువతిపై మూడు నెలలుగా అఘాయిత్యం కొనసాగిస్తూ వచ్చారు.. యువతి గర్భిణీ అని తేలటంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు.. అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.. యువతికి ఒంగోలు రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు చంద్రపాడులో ఓ నిరుపేద కుటుంబం నివాసం ఉటుంది.. అయితే, వారి కుమార్తె పుట్టుకతోనే మూగ కావడంతో ఆమెను ఇంటి వద్దే ఉంచి.. వారు పనులకు వెళ్లేవారు.. ఇక, యువతి ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న స్థానికంగా ఉండే ఓ యువకుడు.. ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు.. మాయమాటలు చెప్పి ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు.. అక్కడితో ఆగకుండా తన స్నేహితులిద్దరిని కూడా కొంతకాలంగా వెంట తీసుకెళ్లి.. ఆ బాధితురాలిని బెదిరించి సామూహికల అత్యాచారానికి పాల్పడ్డారని.. యువతి గర్భం దాల్చడంతో.. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

Show comments