Site icon NTV Telugu

రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

Oil Massage

Oil Massage

ఆధునిక జీవనశైలిలో మనం రకరకాల ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు, ఆరోగ్య సంరక్షణ మందులపై ఆధారపడుతున్నాం కానీ, మన ఇంటి వంటగదిలోనే దాగి ఉన్న అద్భుత ఔషధం ‘ఆవనూనె’ (Mustard Oil) విశిష్టతను తరచుగా మర్చిపోతుంటాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, రాత్రి పడుకునే ముందు శరీరంలోని రెండు కీలక భాగాలైన నాభి (బొడ్డు) , అరకాళ్లకు ఆవనూనెతో మసాజ్ చేయడం అనేది ఒక శక్తివంతమైన చికిత్సగా పనిచేస్తుంది.

Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

మన శరీరంలోని వేలాది నరాలు బొడ్డుతో అనుసంధానమై ఉండటం వల్ల, అక్కడ నూనె రాయడం కేవలం చర్మానికే కాకుండా కంటి చూపు నుండి జీర్ణవ్యవస్థ వరకు అనేక అంతర్గత అవయవాలకు పోషణను అందిస్తుంది. అదేవిధంగా, రోజంతా అలసిపోయిన పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పట్టడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ అద్భుతంగా మెరుగుపడుతుంది. విటమిన్-ఇ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ సహజ సిద్ధమైన చిట్కాను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

నాభి (బొడ్డు) వద్ద మసాజ్ చేయడం వల్ల కలిగే లాభాలు:

పగిలిన పెదవులు: పెదవులు పొడిబారడం , పగలడం వంటి సమస్యలు తగ్గుతాయి.

జీర్ణక్రియ: కడుపు నొప్పి తగ్గడమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కంటి ఆరోగ్యం: కళ్లలో దురద, మంటలు తగ్గడానికి సహాయపడుతుంది.

చర్మం: చర్మం పొడిబారకుండా మెత్తగా , కాంతివంతంగా మారుతుంది.

అరకాళ్లకు మసాజ్ చేయడం వల్ల కలిగే లాభాలు:

మంచి నిద్ర: ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పడుతుంది.

కంటి చూపు: కంటి చూపు మెరుగుపడటానికి ఈ మసాజ్ ఎంతో దోహదపడుతుంది.

బరువు తగ్గడం: శరీరంలోని అదనపు కొవ్వు తగ్గడానికి , బరువు నియంత్రణకు సహాయపడుతుంది.

రక్త ప్రసరణ: పాదాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి రోజంతా ఉన్న అలసట మాయమవుతుంది.

ఆవనూనె ప్రత్యేకత ఏమిటి?

ఆవనూనెలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని పోషించడమే కాకుండా చర్మాన్ని టైట్‌గా, మృదువుగా ఉంచుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, రాషెస్ రాకుండా కాపాడుతుంది.

ముఖ్యంగా మహిళలు రాత్రిపూట బొడ్డుకు ఆవనూనె రాయడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

 

Exit mobile version