Site icon NTV Telugu

Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ఔట్‌.. పాకిస్థాన్ సూపర్‌ లీగ్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కి ఛాన్స్

Mustafizur Rahman

Mustafizur Rahman

Mustafizur Rahman: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు ఫ్రాంచైజ్ క్రికెట్‌లో కొత్త గమ్యం దొరికింది. ఐపీఎల్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న వెంటనే.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌ ఆఫర్ వచ్చింది. ఈ పరిణామం క్రికెట్ వర్గాల్లో, ముఖ్యంగా బోర్డులు, టోర్నమెంట్ నిర్వాహకుల మధ్య పెద్ద చర్చలకు దారి తీసింది. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్ ముస్తాఫిజుర్‌ను జట్టులో నుంచి తొలగించింది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ కేకేఆర్ అతడిని రూ. 9.20 కోట్లకు దక్కించుకుంది. అలాంటి ఆటగాడిని మధ్యలోనే వదిలేయడం ఆర్థికంగానూ, రాజకీయంగానూ కీలక నిర్ణయంగా మారింది.

READ MORE: Trump: మోడీతో నేను బాగానే ఉన్నా.. ఆయనే నాతో సంతోషంగా లేరు.. ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ నుంచి బయటపడిన కొద్ది రోజులకే, పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులు తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా ముస్తాఫిజుర్ వచ్చే సీజన్‌లో ఆడతాడని ప్రకటించారు. ఇంకా పీఎస్ఎల్ డ్రాఫ్ట్ జరగకముందే ఈ ప్రకటన రావడం విశేషం. జనవరి 21న డ్రాఫ్ట్ జరగనుంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ముస్తాఫిజుర్ మళ్లీ పీఎస్ఎల్‌లో అడుగుపెడుతున్నాడు. చివరిసారిగా లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడాడు. ఈ తరుణంలో.. భారత్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఈ విషయంపై ఐసీసీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య జరుగుతుంది. భారత్‌తో ఉన్న దౌత్య సంబంధాలు సరిగా లేవని చెబుతూ, తమ జట్టును భారత్‌కు పంపడంపై బీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌లో తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని అధికారికంగా కోరింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. వాటిలో వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. మరో మ్యాచ్ ముంబైలో నేపాల్‌తో ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ పలు మార్గాలను పరిశీలిస్తోంది.

READ MORE: MSVPG First Ticket: అభిమానం అంటే ఇది కదా.. రూ.1.11 లక్షలకు మొదటి టికెట్‌ కొన్న అభిమాని!
https://www.example.com/cricket/psl/

Exit mobile version