అమ్మో వర్షాకాలం వస్తుందంటేనే మనం సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. అయితే ఆహారంలో తరచుగా అల్లాన్ని తీసుకోవటం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించవచ్చు అని మన పూర్వీకులు తెలియజేస్తున్నారు. అయితే ప్రతి చిన్న విషయానికి మెడిసిన్ మీద ఆధారపడే నేటి తరానికి ఈ విషయం మీద పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే ఓసారి అల్లంతో కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం.
Read Also : Project k : సినిమాలో కమల్ హాసన్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
దీనిని నిత్యం ఆహారంలో వాడటం వల్ల మనకి తెలియకుండానే సగం రోగాలు నయమవుతాయి. అల్లంలో సహజంగా జంజిరల్ అనే సన్మానం ఉంటుంది.. ఇది జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల మనకి డైజేషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.
అల్లం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. గుండెలో మంటగా కనిపించినప్పుడు అల్లం టీ తీసుకోవటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమే. అల్లం వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఆర్థరైటిస్ లక్షణాల చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
Read Also : Amit Shah-KTR: లాస్ట్ మినిట్‌లో కేటీఆర్ తో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు
రోజు ఆహారంలో తీసుకోవడం ద్వారా నొప్పి- వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ఈ అల్లంని టీ రూపంలో మనం తీసుకోవచ్చు తర్వాత స్మూతీస్ లో కూడా ఈ అల్లాన్ని కలపటం వల్ల తగిన రుచితో పాటు మీ గట్ క్లీనింగ్ లో మీకు హెల్ప్ చేస్తుంది. ఇక అల్లం జామ్ చేసి పిల్లలకి పెట్టడం ద్వారా వాళ్లు ఇష్టంగా దీన్ని తింటారు. అలాగే అల్లం పచ్చడి అల్లం ఊరగాయ పెట్టుకొని సంవత్సరం మొత్తం మన ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. మీరు రక్తాన్ని పలుచన చేసే మందులను కలిగి ఉన్నట్లయితే అల్లం మరింత రక్తం సన్నబడటానికి కారణం అవుతుంది. కాబట్టి బ్లడ్ తిన్నర్ మెడిసిన్ వాడేవారు అల్లం వాడకం విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.