CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసమే
- ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో 212 పోస్టులు
- దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగం లభించక, బిజినెస్ చేసే స్థోమత లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సాధించే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీ కానున్న పోస్టుల్లో సూపరింటెండెంట్ 142, జూనియర్ అసిస్టెంట్ 70 పోస్టులున్నాయి. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు సూపరింటెండెంట్ పోస్టులకు 30 ఏళ్లు.. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
అప్లికేషన్ ఫీజు అన్‌రిజర్వ్‌డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ వారికి రూ.800గా నిర్ణయించారు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఈ పోస్టులకు సీబీటీ, స్కిల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 31 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!