బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్‌గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది. ఈ బుధవారం హిందువుల ఇళ్లపై గుంపు దాడులు చేసింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లో హిందూ యువకుడిపై దైవదూషణ ఆరోపణలు రావడంతో హింస జరిగింది. ఛాందసవాద మూక 100 మందికి పైగా హిందువుల ఇళ్లను ధ్వంసం చేసింది. ఇళ్లలోని ప్రార్థనా స్థలాలను కూడా వదిలిపెట్టలేదు. మీడియా నివేదిక ప్రకారం, ఇటీవల 200కు పైగా హిందూ కుటుంబాలు వలస వెళ్లాయి. ఆరోపణల నేపథ్యంలో, దైవదూషణ ఆరోపణలపై సుమన్‌గంజ్‌లోని మంగళర్‌గావ్‌కు చెందిన ఆకాష్ దాస్ (20)ని పోలీసులు అరెస్టు చేశారు.
READ MORE: RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం
హిందువులపై జరుగుతున్న దాడులను భారత దేశానికి చెందిన పలువురు ముస్లిం నేతలు తీవ్రంగా ఖండించారు. త్వరగా దాడులను ఆపాలని కోరుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్‌కు గురువారం లేఖ రాశారు. దీనిపై సంతకాలు చేసిన వారిలో ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్.వై.ఖురేషి, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, పారిశ్రామికవేత్త సయీద్ శేర్వాణీ తోపాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. మైనారిటీలపై వేధింపులను వారి ఇస్లాం వ్యతిరేక చర్యలు అని లేఖలో పేర్కొన్నారు. భారత జాతీయ పతాకాన్ని అవమానించే చర్యలను వెంటనే అడ్డుకోవాలని ముస్లింలకు చెందిన త్రిపుర గౌసియా సమితి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
READ MORE: Kollywood : అభిమానుల్ని టెన్షన్ పెడుతున్న అజిత్, సూర్య