NTV Telugu Site icon

Ram Mandir: ఒంటిపై హిజాబ్, వీపుపై రాముడి ఫోటో.. అయోధ్యకు బయలు దేరిన ముస్లిం యువతులు

New Project 2023 12 25t134846.208

New Project 2023 12 25t134846.208

Ram Mandir: భుజంపై కాషాయ జెండా, వీపుపై రామమందిరం ఫోటో, ఒంటిపై హిజాబ్ ధరించిన యువతి షబ్నమ్. రాముని భక్తిలో మునిగిపోయిన ఈ యువతి ముంబై నుండి అయోధ్యకు బయలుదేరింది. ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి దాదాపు 1,500 కి.మీ. దూరంలో ఉన్న అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం బయలు దేరారు. ముంబై నుంచి నడుచుకుంటూ వస్తున్న ఈ షబ్నం షేక్‌ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికి షబ్నం రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి నాసిక్ చేరుకుంది. సమయం ఇస్తే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుస్తానని షబ్నం తెలిపారు.

Read Also:Madhya Pradesh: మైనర్ బాలికపై అత్యాచారం.. అవమానం భరించలేకు పురుగుల మందు తాగి..

షబ్నమ్ రాంలాలాను చూడాలనుకుంటోంది. ఆమె తనను తాను సనాతన ముస్లిం అని చెప్పుకుంటుంది. ఆమెకు భద్రత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మహిళా పోలీసులను ఏర్పాటు చేసింది. షబ్నమ్‌కి చిన్నప్పటి నుంచి రామాయణం అంటే అమితమైన ఇష్టం. ఆమె మహాభారతం సీరియల్ పూర్తిగా చూసింది. రామాయణం, మహాభారతాలు ఆమె జీవితాన్ని చాలా బాగా ప్రభావితం చేశాయి. ఆమె రాముడిని తన రోల్ మోడల్‌గా భావిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా తనను అయోధ్యకు వెళ్లమని ప్రోత్సహించారు. అయోధ్యలో శ్రీరాముడి దర్శనం అనంతరం ఆమె అయోధ్యలోని ధనిపూర్‌లో నిర్మాణంలో ఉన్న మసీదుకు వెళ్లనున్నారు. దీని ద్వారా తనకు రెండు మతాల పట్ల ఆసక్తి ఉందనే సందేశాన్ని అందించబోతోంది.

Read Also:Chennai: “ట్రాన్స్‌జెండర్ లవ్ స్టోరీ”.. ప్రేమను ఒప్పుకోలేదని నందిని దారుణ హత్య..

జనవరి 22న అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ వేడుక సందర్భంగా షబ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాలినడకన ముంబై నుంచి బయలుదేరింది. ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు రామన్‌రాజ్ శర్మ, బినిత్ పాండే ఉన్నారు. తనకు రామాయణం, శ్రీరాముడిపై చాలా ఆసక్తి ఉందని ఆమె స్పందించారు. అదేవిధంగా అయోధ్యకు వెళ్లి శ్రీరామచంద్రుడి గురించి మరింత తెలుసుకోవాలనేది తన ఆశయమని షబ్నమ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కృషితో తాను స్ఫూర్తి పొందానని షబ్నమ్ అన్నారు.