Site icon NTV Telugu

Meerut: భర్తను చంపి డ్రమ్‌లో పెట్టిన ముస్కాన్ తల్లైంది.. కుమార్తె జననం.. ఎనిమిది నెలలుగా తన ప్రేమికుడితో జైలులోనే

Muskan

Muskan

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగి తల్లైంది. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Also Read:Andhra Pradesh: పులులు, ఏనుగుల సంరక్షణకు చర్యలు.. అదనపు నిధులు విడుదల

ముస్కాన్ ఎనిమిది నెలలుగా తన ప్రేమికుడితో కలిసి జైలులో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముస్కాన్ హత్య కేసులో జైలు పాలైన ముస్కాన్ భర్త సౌరభ్ రాజ్‌పుత్ పుట్టిన రోజు కూడా నవంబర్ 24 కావడం గమనార్హం. అదే రోజున ముస్కాన్ తన రెండవ కుమార్తెకు జన్మనిచ్చింది. ముస్కాన్ మొదటి కుమార్తె పిహు ప్రస్తుతం సౌరభ్ తల్లిదండ్రులతో నివసిస్తోంది. పోలీసులు ముస్కాన్, ఆమె ప్రేమికుడు అని చెప్పబడుతున్న సాహిల్‌ను అరెస్టు చేసినప్పుడు, ఆమె దాదాపు నెలన్నర గర్భవతి.

Exit mobile version