Site icon NTV Telugu

Vipin Reshammiya: హిమేష్ రేష్మియా తండ్రి విపిన్ రేష్మియా మృతి..

Vipin Reshammiya

Vipin Reshammiya

Vipin Reshammiya: ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత స్వరకర్త హిమేష్ రేషమియా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు విపిన్ రేష్మియా, సంగీతకారుడు హిమేష్ రేషమ్మియా తండ్రి 87 సంవత్సరాల వయస్సులో మరణించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. విపిన్ రేష్మియా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆయన అర్థరాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు (సెప్టెంబర్ 19)న ముంబైలో జరుగుతాయి.

UP : యూపీలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

విపిన్ రేష్మియా సంగీత దర్శకత్వం వైపు మళ్లడానికి ముందు టెలివిజన్ సీరియల్ నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. తేరా సురూర్, ది ఎక్స్‌పోజ్, ఇన్సాఫ్ కి జంగ్ చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. అతని కుమారుడు హిమేష్ రేష్మియా విపిన్ రేష్మియా ‘ది ఎక్స్‌పోజ్’, ‘తేరా సురూర్’ చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇది కాకుండా విపిన్ ‘ఇన్సాఫ్ కా సూరజ్’ అనే చిత్రానికి సంగీతం అందించారు. అయితే అది ఇప్పటివరకు విడుదల కాలేదు. 2021 సంవత్సరంలో, హిమేష్ ‘ ఇండియన్ ఐడల్ ‘ సెట్స్‌లో తన తండ్రి అద్భుతమైన పాటను కంపోజ్ చేశారని.. దానిని లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ కలిసి పాడారని వెల్లడించారు. కానీ ఈ పాట విడుదల కాలేదు.

Exit mobile version