Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Report Today: ఆంధ్రప్రదేశ్‌కు మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మురసు తుఫాన్‌తో ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అలానే నెల్లూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు.
గత ఆరు గంటల్లో గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మురసు తుఫాన్.. ప్రస్తుతం చెన్నైకి 260 కిలోమీటర్లు, నెల్లూరుకు 290 కిలోమీటర్లు, కావలికి 310 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు–నరసాపురం ప్రాంతాల మధ్య, ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
- SOS బటన్, Family Assist ఫీచర్లtho 'సీనియర్ సిటిజన్ల' కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
- Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
మురసు తుఫాన్ ప్రభావంతో సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు.
అలాగే నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యల కోసం ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే తాజా హెచ్చరికలను పాటించాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!