NTV Telugu Site icon

West Bengal : భర్త చనిపోవడంతో బతకలేనంటూ ఏడుస్తూ కన్నుమూసిన భార్య

New Project 2024 07 24t081357.636

New Project 2024 07 24t081357.636

West Bengal : భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రత్యేకమైనది. రెండు వేరు వేరు స్వభావాలు కలిగిన మనస్సులు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతాయి. ఇక దంపతుల మధ్య ఉండే ప్రేమానుబంధాలు చాలా ప్రత్యేకం. కష్టాసుఖాల్లో పాలు పంచుకుంటూ సంసారం సాగిస్తుంటారు. ఒకరినిఒకరు చూసుకోకుండా అస్సలు ఉండలేరు. ఏడేడు జన్మలు కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే దానిని నిలబెట్టుకోగలుగుతారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ జంట దీన్ని నిజం చేసింది. భర్త చనిపోయిన మూడు నిమిషాలకే భార్య కూడా ప్రాణత్యాగం చేసింది. వారిద్దరి అంత్యక్రియల ఊరేగింపు ఇంటి నుండి కలిసి బయలుదేరడంతో చూసిన వాళ్లంతా కన్నీటి పర్వంతం అయ్యారు. ఇప్పుడు ఇదే ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Read Also:Tirumala Tickets: నేడు టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకే..!

అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ మండల్ (85) సోమవారం మృతి చెందారు. 68 ఏళ్ల భార్య నియతి మండల్ తన భర్త మరణంతో షాక్‌కి గురైంది. ఆమె అతని ఛాతీపై తల పెట్టుకుని ఏడవడం ప్రారంభించింది. మూడు నిమిషాల తర్వాత నియతి కూడా చనిపోయింది. ఇద్దరూ కలిసి 50 ఏళ్లు గడిపారు. సమాచారం మేరకు భరత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోల్తా గ్రామంలో నివసిస్తున్న శంకర్ మండల్‌కు 50 ఏళ్ల క్రితం నియతి మండల్‌తో వివాహమైంది. వారికి పిల్లలు, మనువలు కూడా ఉన్నారు. పూర్తి కుటుంబ జీవితాన్ని అనుభవించారు. ఈ జంట కుటుంబంతో చాలా సంతోషంగా గడిపారు. కానీ శంకర్‌కి 85 ఏళ్లు వచ్చేసరికి వయసు రీత్యా అనారోగ్య సమస్యలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.

Read Also:Tollywood Talk: నెక్ట్స్ రూ.1000 కోట్ల హీరో ఎవరు..రేస్ లో ముగ్గురు హీరోలు.!

అతడిని చికిత్స నిమిత్తం భరత్‌పూర్‌ గ్రామీణ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిరోజుల తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఒకటి రెండు రోజుల తర్వాత సోమవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపే శంకర్ మృతి చెందాడు. నియతి మండలం తన భర్త మృతిని తట్టుకోలేకపోయింది. భర్త మృతదేహం దగ్గర కూర్చుంది. ఆమె అతని ఛాతీపై తల ఉంచి ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తూనే సైలెంట్ అయిపోయింది నియతి. వెంటనే భర్త మృతదేహం నుంచి ఆమెను వేరు చేసేందుకు కుటుంబీకులు ప్రయత్నించగా, నియతిలో చలనం లేకుండా శరీరం చల్లబడినట్టు గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ చెక్ చేయగా, నియతి కూడా చనిపోయిందని చెప్పారు. భర్త చనిపోయిన 3 నిమిషాలకే నియతి మరణించింది. ఇది చూసిన ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది. అనంతరం నియతి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భార్యాభర్తలిద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.