జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామనికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులు, రాజు, రాజేశం అనే వ్యక్తులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 15000/- రూపాయల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ తీర్పు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుర్గయ్య ( 60 )సంవత్సరాల వ్యక్తి అదే గ్రామంలో బండ కొట్టే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Also Read:Bengaluru: “సొంత దేశంలో రక్షణ లేదు”.. కన్నడలో తిడుతూ ఈశాన్య మహిళకు వేధింపులు..
అదే గ్రామానికి చెందిన రాజేశం, రాజు అనే అన్నదమ్ముల తో దుర్గయ్య కు నిత్యం పాత గొడవలు ఉన్నాయి. ఫిబ్రవరి 19, 2021 న మద్యం సేవించి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన దుర్గయ్య.. రాత్రి గడిచిన దుర్గయ్య ఇంటికి రాకపోవడం తో కుటుంబ సభ్యులు బుగ్గరాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 20,2021 రోజున బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దునూరు గ్రామ శివారులో గుట్టల ప్రాంతంలో దుర్గయ్యను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముఖం, తలపై బండరాయితో కొట్టి, గాజు సిసాలతో పొడిచి హత్య చేశారు.
Also Read:IPL 2026-CSK: ఐపీఎల్ 2026 ముందు చెన్నై నుంచి ఐదుగురు అవుట్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!
మృతుని కుమారుడు శేఖర్ ఫిర్యాదు మేరకు బుగ్గారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. సూర దుర్గయ్యను హత్య చేసిన నిందితులు రాజు, రాజేశంలుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితులపై నేరం రుజువు కావడం తో రాజు, 33yrs, రాజేశం,39 yrs అనే నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 15000/- రూపాయల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి నారాయణ తీర్పు చెప్పారు.
