Site icon NTV Telugu

Murder : మేడ్చల్‌లో పట్టపగలే దారుణ హత్య.. చంపేసి తాపీగా వెళ్లిపోయిన హంతకులు

Crime

Crime

Murder : మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచి, చంపాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్టు సమాచారం. సీఐ సత్యనారాయణ, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గన్యా స్వగ్రామం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి. మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న కారణంగా కుటుంబంతో సహా మేడ్చల్ కు వచ్చి, బతుకుతున్నాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. హత్యకు గురైన వ్యక్తి సంతానంలో రెండు వాడు కాగా, హత్య చేసింది చిన్న కుమారుడిగా భావిస్తున్నారు.

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ఆర్సీబీ-కేకేఆర్, ఫైనల్ మే 25

Exit mobile version