NTV Telugu Site icon

Murder: హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్య

Murder

Murder

Murder In Hyderabad: బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్య జరిగింది. హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో కత్తులతో దాడి చేసి హత్య చేసాడు సిద్దిక్ అనే వ్యక్తి. విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఈ హత్యకి గల కారణాలు పాతకక్షలుగా ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు పోలీసులు.

Read Also: Ratan Tata Love Story : విషాదంగా రతన్ టాటా లవ్ స్టోరీ.. ఆమె కోసమే ఆయన పెళ్లి చేసుకోలేదా?

ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి సిధ్దక్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య కి గల కారణాలు అక్రమ సంబంధంగా మరో ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఫలక్ నామ ఎసిపి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సంబంధించిన కెమెరాలలో కత్తి పొట్ల దృశ్యాలు ఉన్నట్లు తెలిసింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ..11 గంటల ప్రాంతంలో ఫాతిమా నగర్ అందే లంగెడ్ బస్తీలో సిద్ధిక్ అనే వ్యక్తి రోడ్డు పై సదెక్క్ అలియాస్ సాజిద్ అనే వ్యక్తి కత్తి తో దాడిచేశాడు ఆ తర్వాత స్థానికులు అతనిని ఒస్మానియా తరలించి చూడగా మార్గ మద్యంలో చనిపోయినట్లు సమాచారం టీంలు రెడీ చేసి నిందితుని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. కానీ., మృతుడు, నిందితుడుల మధ్య మృతుని భార్య గురించి పలుమార్లు ఫలక్ నామ పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు కూడా అయ్యాయి. కానీ., ఫలితం శూన్యం. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని., ఒకవేళ తీసుకొంటే హత్యకు దారి తీసేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు.

Read Also: Nitish Kumar Reddy: రెండో మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సృష్టించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి

Show comments