ఫిబ్రవరి 23వ తేదిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామ శివారులోని మధుపాల వెంచర్ లో లభ్యమైన మహిళ మృతదేహం కేసును చేదించిన శంషాబాద్ పోలీసులు. కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ సీఐ శ్రీధర్ కుమార్ వెల్లడించారు. మృతురాలు రామాంజాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ. భర్త లేకపోవడంతో లేబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే అదే గ్రామానికి చెందిన కత్తుల రాజు వృతి డ్రైవర్ ఆరు నెలలుగా పద్మమ్మ తో పరిచయం. అయితే అమెతో శారీరకంగా కలిసి డబ్బులు ఇవ్వలేదని కొన్ని రోజులు ఇద్దరు మాట్లాడుకోలేదు. దీంతో కొన్ని రోజుల తరువాత పద్మమ్మ రాజుకు ఫోన్ చేసి డబ్బుల విషయం అడిగింది.
Also Read : Drunken Police : మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం.. నడిరోడ్డుపై లారీలు ఆపి..
దీంతో రాజు బయటకు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి ఫిబ్రవరి 19న వైన్స్ షాపులో బీర్ బాటిల్ కొనుక్కుని పద్మమ్మను తన బైక్ పై ఎక్కించుకుని మల్కారం గ్రామ శివారులోని మధుపాల వెంచర్ లోకి తీసుకెళ్ళి బీర్ తాగించి బలవంతంగా శారీరకంగా కలిసాడు. అయితే మళ్ళి డబ్బులు ఇవ్వకపోవడంతో అరుచుకుంటూ పరుగులు తీస్తుండగా అమెను పట్టుకుని చీరతో మెడకు చుట్టు హత్య చేసి పరారయ్యాడు. దీంతో సిసిటివి, సిడిఆర్ సహయంతో నిందితుడు రాజును అదుపులోకి విచారించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read : G20: ప్రతీకారం కోసం పాశ్చాత్య దేశాల ప్రయత్నం.. రష్యా ఘాటు వ్యాఖ్యలు..
