NTV Telugu Site icon

Murder Case: వేట కొడవళ్లతో సత్యసాయి జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యకర్త హత్య..!

4

4

శ్రీ సత్య సాయి జిల్లాలో టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. జిల్లాలోని నల్లమడ మండలం కోటాలపల్లి గ్రామానికి చెందిన ఓటీడీపీ కార్యకర్తను గుర్తుతెలియని కొందరు దుండగులు విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. పొలం పనుల్లో భాగంగా ఆయన పొలంలో నిద్రిస్తున్న అమర్నాథ్ రెడ్డి ని అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు గొడవలతో దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైంది. జరగబోయే ఎన్నికల నేపధ్యంలో ఈ హత్య తీవ్ర దుమారాన్ని రేపుతుంది.

Also read: Summer Healtcare: నగరంలో పెరుగుతున్న ఉక్కపోత.. మూడ్రోజుల్లో మరింత ఎండలు

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. కూతాలపల్లి గ్రామానికి చెందిన దుద్దుకుంటా అమర్నాథ్ రెడ్డి ఈమధ్య పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరారు. దాంతో ఆయన పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ కారణంగా అమర్నాథ్ రెడ్డి పొలంలోకి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని అక్కడే కాపు కాసి వేట కొడవళ్ళతో గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఈ సంఘటనతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమర్నాథ్ రెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందంగానే వారు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.

Also read: Allu Arjun: ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఐకాన్ స్టార్.. ఎందుకంటే?

అక్కడి పరిస్థితిని చూసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేవలం రాజకీయపరంగా మాత్రమేనా.. లేక ఏదైనా పర్సనల్ గొడవల కారణంగా జరిగిందా అంటూ పోలీసులు ఆరా ఇస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా.. ఈ హత్యకు సంబంధించి ఎలాంటి వివరాలను ఇప్పటివరకు పోలీసులు వెల్లడించలేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.