Accused Caught after 28 Years : హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని 28ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. 1994లో ఓ కుటుంబాన్ని హత్య చేసిన కేసులో కీలక నిందితుడు. అతడి కదలికలపై కన్నేసిన పోలీసులు ముంబై ఎయిర్ పోర్టులో అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత అనేక ప్రాంతాలకు తిరిగి చివరికి ఖతార్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. 1994 నవంబర్‌లో కాషిర్మీరాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేశారు దుండగులు. జాగ్రణీదేవి ప్రజాపతి (27) , ఆమె నలుగురు పిల్లలను ముగ్గురు నిందితులు అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం వారంతా పరారయ్యారు.
Read Also: China Corona: చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆందోళనలో డబ్ల్యూహెచ్‌వో
నిందితులలో ఒకడు ఖతార్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిపై నిఘా పెట్టారు పోలీసులు. గురువారం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే వెంటనే అరెస్ట్ చేసినట్లు MBVV పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్ అవిరాజ్ కురాడే తెలిపారు. వీరు హత్యచేసిన పిల్లలలో మూడు నుంచి ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. హత్య చేసిన తర్వాత ఖతార్ లో పనిచేసుకుంటూ జీవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ముంబైలో దిగిన అతన్ని విమానాశ్రయ అధికారుల సహాయంతో పట్టుకున్నట్లు అధికారి తెలిపారు.