China Corona: చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆందోళనలో డబ్ల్యూహెచ్‌వో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Corona: చైనాలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడిలించిన తర్వాత వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో చైనాలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చైనాలో ఎదరవుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో కరోనా నియంత్రణ, హైరిస్క్ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్‌పై చర్యలు చేపట్టాలని సూచించారు. చైనా ఆరోగ్య వ్యవస్థల పరిరక్షణకు తమ వంతు సహాయసహకారాలు అందజేస్తామని ప్రకటించారు. కాగా, చైనాలో కరోనా కేసుల తీవ్రత అధికమైన నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
Read Also: Bike Romance: రన్నింగ్ బండిపై రొమాన్స్.. రాచ మర్యాదలు చేసిన పోలీసులు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
చైనా నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు పలు మార్గదర్శకాలను జారీ చేశాయి. దాదాపు అక్కడి ప్రయాణికులు రాకుండా నిరోధిస్తున్నాయి. వచ్చినా వారిని ఆర్టీపీసీఆర్ టెస్టులను చేసుకున్న తర్వాతే దేశంలోకి అడుగు పెట్టనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ దీనిపై కూడా స్పందించారు. చైనాలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదు గురించి సరైన సమాచారం లేదన్నారు. అయినప్పటికీ పలు దేశాలు ముందు జాగ్రత్తగా పలు చర్యలు చేపడుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు చైనాలో నమోదవుతున్న కరోనా కేసులు, వేరియంట్ల గురించిన సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చారు. కరోనా గురించి అర్థం చేసుకోవడంలో ఏర్పడే గ్యాప్ వల్ల భవిష్యత్తులో సంభవించే మహమ్మారిలను అర్థం చేసుకోవడం, ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందన్నారు.
In the absence of comprehensive information from #China, it is understandable that countries around the world are acting in ways that they believe may protect their populations. #COVID19
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) December 29, 2022
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!