Site icon NTV Telugu

Murdagada Padmanabham: నేడు వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం

Mudragada

Mudragada

నేడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. నిన్న రాత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటి వరకూ ఆయన కాపు సామాజికవర్గం సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకూ దూరంగా ఉన్నారు. అయితే ఈరోజు ఆయన వైసీపీలో చేరుతుండటంతో సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. అయితే.. కుమారుడి గిరితో కలిసి ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. భారీర్యాలీగా వెళ్లి తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని వెల్లడించారు. అయితే.. నిన్న వైసీపీలో చేరాల్సిన ముద్రగడ చేరిక వాయిదా పడింది. ముుందుగా ప్రకటించిన మార్చి 14న కాకుండా .. నేడు వైసీపీలో చేరనున్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశారు. అలాగే తాడేపల్లికి ర్యాలీగా వెళ్లాలనే తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నారు. కేవలం తానుు మాత్రమే తాడేపల్లికి వెళ్లి వైసీపీలో చేరనున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version