Site icon NTV Telugu

BJP Muralidhar Rao : డబుల్ బెడ్ రూమ్ లు అనేది ఒక నాటకం

Bjp Muralidhar Rao

Bjp Muralidhar Rao

BJP National Leader Muralidhar Rao Made Comments on Chief Minister K.Chandrashekar Rao.
తెలంగాణ బీజేపీ జన గోస- బీజేపీ భరోసా పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం సిద్దిపేటలో జన గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో జాతీయ నాయకుడు మురళీధర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు రావాలి అంటే కేసీఆర్‌ జీవితం సరిపోదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. డబుల్ బెడ్ రూమ్ లు అనేది ఒక నాటకమని ఆయన ఆరోపించారు. తెలంగాణను తిట్టిన వాళ్ళు ఇప్పుడూ మంత్రులు అయ్యారంటూ ఆయన ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ ఫ్యామిలీనే కేబినెట్ అంటూ ఎద్దేవా చేశారు మరళీధర్‌ రావు. దేశంలో అవినీతి రాష్టం తెలంగాణ రాష్ట్రం అని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి బాగా జరిగిందని, దేశ వ్యాప్తంగా ఉన్న సీఎంలలో బూతులు మాట్లాడే సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

Exit mobile version