తరిగే పార్టీ, ఇరిగే పార్టీలు మిగతావి, పెరిగే పార్టీ మాత్రం బీజేపీనే అని వ్యాఖ్యానించారు మురళీధర్ రావు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కాదని, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే 50 ఏళ్లుగా ఎందుకు అపారన్నారు. తెలంగాణ కు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశం నడవాలంటే బలమైన నాయకుడు కావాలి.. అది మోడీనే అని ఆయన అన్నారు. ఉగ్ర వాదం ను కాలు కింద వేసి తొక్కిన వ్యక్తి మోడీ అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ హయం లో నక్సలైట్ల ఉగ్ర వాదం విస్తరించిందన్నారు. బాంబ్ బ్లాస్ట్ లు జరగడం లేదు అంటే దానికి కారణం బీజేపీ అని ఆయన అన్నారు. ముస్లిం కు ఇష్టం ఉన్నట్లు పెళ్ళి చేసుకుంటున్నారు.. పిల్లలు కంటున్నారని, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసింది మోడీ సర్కార్ అని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ‘ఓవైసీకి ట్రిపుల్ తలాక్ కావాలంటా. అందుకే దానికి మేము తలాక్ ఇచ్చినం. రాముడు ఇక్కడే ఉన్నాడు అని, సీఎం అంటున్నారు..రాముడు ముందు అయోధ్య లోనే పుట్టాడు. అయోధ్య తరవాత నే భద్రాచలం రేవంత్ రెడ్డి చరిత్ర చదువు కోవాలి. రాముడిని వ్యతిరేకించిన పార్టీ ఒక్క వైపు, రామ మందిరం కట్టిన పార్టీ మరో వైపు ఉంది. బీఆర్ఎస్ కు అడ్రస్ లేదు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే పార్లమెంట్ లో పనికి రాదు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అయ్యేది ఎం లేదు. రేవంత్ రెడ్డి కి కేసీఆర్ గతి పట్టుతది. అది కొద్ది రోజుల్లోనే అయితది. సీఎం ను మార్చే పార్టీ కాంగ్రెస్. 5 ఏళ్లు ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటాదా. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు. బూత్ స్థాయి లీడర్లు లేరు.. కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ లో అడుగు పెట్టరు. వారికే గ్యారంటీ లేదు.. వాళ్లేం గ్యారంటీ లు అమలు చేస్తారు. ఢిల్లీ పార్టీకి తెలంగాణ ఏ టీ ఎం సెంటర్ అయింది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
