Site icon NTV Telugu

Muralidhar Rao: వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదే..!

Murlidhar

Murlidhar

భారతదేశంలో అవినీతికి ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు అని బీజేపీ ఛార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు అన్నారు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదు.. పిల్లర్లు కుంగిపోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడింది.. ఎన్నికల ముందు భగవంతుడే అవినీతిని బయటపెట్టాడని అనిపిస్తుంది అని ఆయన తెలిపారు. రుణమాఫీ వడ్డీలకే సరిపడే పరిస్థితి.. పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఒక్క పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయలేదు.. దళిత ముఖ్యమంత్రి మొదలు దళిత బందు హామీ వరకు దగా చేశారు అని మురళీధర్ రావు చెప్పుకొచ్చారు.

Read Also: SL vs BAN: శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్లో అనూహ్య ఘటన

2014, 2018మేనిఫెస్టో, ప్రజల మధ్య, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు అని మురళీధర్ రావు పేర్కొన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు.. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ సర్కారు విఫలం అయ్యాయని ఆయన ఆరోపించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాలు చేపడుతామని వాటిని విస్మరించారు.. సింగరేణిలో నిమ్స్ ను ఏర్పాటు చేస్తామని చేయలేదు.. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఆ ఊసే లేదు.. అనేక అంశాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచామని బీజేపీ ఛార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు అన్నారు.

Read Also: Adimulapu Suresh: సంక్షేమం, అభివృద్ధి జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు..

దేవాలయ భూములు తెలంగాణలో కబ్జా అయినంత దేశంలో ఎక్కడా జరగలేదు అని బీజేపీ నేత మురళీధర్ రావు చెప్పుకొచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు.. తెలంగాణ అంటే లిక్కర్.. లిక్కర్ అంటే తెలంగాణ.. డ్రగ్స్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే డ్రగ్స్ అంటూ ఆరోపించారు. వీటన్నింటకీ కారణం బీఆర్ఎస్ సర్కారు.. ముఖ్యమంత్రి ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో లేరు.. వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదేనని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version