Murali Vijay: క్రికెట్‌కు మురళీ విజయ్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పాడు. ప్రపంచ క్రికెట్లో కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. 2018 డిసెంబర్లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అతడు తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో కనిపించాడు. మొత్తంగా తన కెరీర్లో ఇండియా తరఫున మురళీ విజయ్ 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. 2008 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి టెస్టే విజయ్‌కు తొలి మ్యాచ్. మొత్తం ఆడిన 61 టెస్టుల్లో 3,982 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
Also Read
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
— Murali Vijay (@mvj888) January 30, 2023
ఇక 17 వన్డేల్లో ఒకే హాఫ్ సెంచరీతో 339 రన్స్ చేయగా.. 9 టీ20ల్లో 169 రన్స్ చేశాడు. తన రిటైర్మెంట్ ప్రకటనను ట్విట్టర్ ద్వారా విజయ్ వెల్లడించాడు. “అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నా. 2002 నుంచి 2018 వరకు నా జీవితంలో అద్భుతమైన క్షణాలు. ఇండియా తరఫున అత్యున్నత స్థాయిలో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, కెంప్లాస్ట్ సన్మార్లకు కృతజ్ఞతలు. నా టీమ్ మేట్స్, కోచ్‌లు, గురువులు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. మీ అందరితో కలిసి ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నా కలను నిజం చేయడంలో మీరు చేసిన సాయానికి థ్యాంక్యూ. నా కెరీర్ ఒడిదుడుకుల్లోనూ నా వెంట ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు కూడా కృతజ్ఞతలు” అని విజయ్ ట్వీట్ చేశాడు. కాగా, తమిళనాడు తరఫున మురళీ విజయ్ తన కెరీర్లో మొత్తం 135 ఫస్ట్ క్లాస్, 94 లిస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇక అతడు ఐపీఎల్‌లోనూ 106 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మెగా లీగ్‌లో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో 2,619 రన్స్ చేశాడు.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!