New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New York Accident: అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన యువకుడు ఈరమళ్ల సాయితేజ (25) దుర్మరణం పాలయ్యాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, సరిగ్గా వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించిన సాయితేజ మృతితో మునుగోడులోని అతని కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో న్యూయార్క్ స్టేట్ త్రూవే (ఇంటర్‌స్టేట్ 90) పై కనాజోహారీ సమీపంలో సాయితేజ వాహనానికి అకస్మాత్తుగా ఒక జింక అడ్డువచ్చింది. జింకను ఢీకొట్టడంతో సాయితేజ కారు నిలిచిపోయింది. కొద్ది క్షణాల్లోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక సరకు రవాణా వ్యాన్ (ట్రక్కు) ఆగి ఉన్న సాయితేజ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి మరో రెండు వాహనాలు కూడా ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం నాలుగు వాహనాలు ఈ ప్రమాదానికి గురయ్యాయి.
Also Read
- Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
- Telugu Movie Piracy: టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ఒకే వెబ్సైట్లో 4 కొత్త సినిమాలు లీక్..
- Gold and Silver Prices: గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ పతనం.. వారం రోజుల్లో ఎంత తగ్గిందంటే..?
- దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
తీవ్రంగా గాయపడిన సాయితేజను పోలీసులు సెయింట్ మేరీస్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో సాయితేజ కారులో ఉన్న మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడటంతో హెలికాప్టర్ ద్వారా అల్బానీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కార్గో వ్యాన్‌లోని మరో ప్రయాణికుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా త్రూవేపై ఎగ్జిట్ 28, 29 మధ్య తూర్పు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేసిన పోలీసులు, గురువారం తెల్లవారుజామున 1:15 గంటలకు తిరిగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మునుగోడుకు చెందిన ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడైన సాయితేజ మరణవార్త విని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంపై న్యూయార్క్ స్టేట్ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Mayukha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. కానీ ఒక్క కండిషన్?
-
New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Hardik Pandya Trade: హార్దిక్‌ను ఎందుకు తీసుకున్నామంటే.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UNEXPECTED – SAFED SACH: దేశాన్ని కుదిపేసిన డెహ్రాడూన్ బస్సు ఘటనపై సినిమా
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!