Site icon NTV Telugu

Munugode Bypoll: సమరానికి సర్వం సిద్ధం.. భారీగా భద్రతా బలగాల ఏర్పాటు

Munugode Bypoll

Munugode Bypoll

Munugode Bypoll : మునుగోడులో ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 3న నిర్వహించే ఉపఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. చండూరులోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలించారు. అనంతరం నల్లగొండ ఆర్జాలబావి గోదాముల్లో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రానికి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దని.. బల్క్ ఎస్ఎమ్ఎస్ లు సైతం నిషేధించబడినవని తెలిపారు. మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.

Read Also: Kamal Movie Crazy Update: క్రేజీ అప్డేట్.. భారతీయుడు-2లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి

నియోజకవర్గంలోకి బయటి వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిలా ఎన్నికల అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి పంపిణీ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు అక్కడ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్త్ పై ఆరా తీశారు. స్పాట్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, సెక్టార్‌ టీమ్స్‌, పోలింగ్‌ స్టేషన్ల భద్రతను పర్యవేక్షించడానికి, నిర్ధారించడానికి వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మునుగోడులో బయటి వ్యక్తుల సంఖ్యను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించినట్టు చెప్పారు.

Trisha Hikes Remuneration: రేటు పెంచిన త్రిష.. అన్ని కోట్లంటే వామ్మో అంటున్న నిర్మాతలు

ఇక మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న (గురువారం) ఉదయం 7 గంటలకు మొదలు కానుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా కొనసాగుతుంది. ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 47 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత ఈ నెల 6న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Exit mobile version